పోలీసులకు దొరికేశాడు...
రాహుల్ మహిదా స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. తాను తరచుగా ఓ ఇంటికి ఫుడ్ డెలివరీ చేసేవాడు. స్నేహితులంతా కలిసి భోంచేసేవారు. ఆహారంతో పాటు బీరు సరఫరా చేస్తే బాగుంటుందని రాహుల్‌కు ఉచిత సలహా కూడా ఇచ్చారు. అలా వారి స్నేహం కుదిరింది, కోరినప్పుడల్లా వారికి ఫుడ్‌తో పాటు బీరు డెలివరీ చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నాడు. మద్యపాన నిషేధం పూర్తిగా అమలవుతున్న రాష్ట్రంలో బీరు దొరకడం అంత సులభం కాదు. అయినా సాహసం చేసి బీరు తీసుకొచ్చాడంటే అతని కస్టమర్లపై ఉన్న ప్రేమ అలాంటిది మరి.
అక్రమంగా సాగిస్తున్న ఆ సైడ్ బిజినెస్ ఎక్కువ రోజులు నడవలేదు. ఫుడ్ డెలివరీ ముసుగులో మద్యం సరఫరా చేస్తూ చివరకు పోలీసులకు దొరికిపోయాడు. ఎట్టకేలకు బీరు డెలివరీ బాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు..
ఇదీ చూడండి: వేలి ముద్రలతో వాట్సాప్‌కు తాళం వేయండిక!