స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) సంయుక్తంగా కాంటాక్ట్‌లెస్ క్రెడిట్‌కార్డును అందుబాటులోకి తెచ్చాయి. ఆత్మనిర్భర్ భారత్, డిజటల్ ఇండియా దిశగా పడిన మరో అడుగు ఇది. రూపే ప్లాట్‌ఫాంపై తీసుకొచ్చిన కోబ్రాండెడ్ కార్డును మంగళవారం కేంద్ర రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్ ఆవిష్కరించారు. రైల్వే టికెట్ల కొనుగోలుకు, ఇతర కొనుగోళ్లకు ఇది వాడుకోవచ్చు.
2021 కల్లా ఈ కార్డు వినియోగదారుల సంఖ్య 3 కోట్లకు చేరాలని పీయూష్ గోయల్ లక్ష్యాన్ని నిర్దేశించారు. 'వచ్చే ఏడాది డిసెంబరు 25 కల్లా, అంటే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ జయంతి నాటికి ఈ ఎస్‌బీఐ కార్డును వినియోగించే వాళ్ల సంఖ్య కనీసం 3 కోట్లుగా నమోదుకావాల'ని గోయల్ అన్నారు. 'వినియోగదారులు ఈ కార్డు ద్వారా వేగంగా, సురక్షితంగా లావాదేవీలు నిర్వహించే వీలుంటుందని, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సాంకేతికత ఇందుకు ఉపకరిస్తుంద'ని ఆయన అన్నారు. 2021 మార్చి 31 వరకు ఈ కార్డు జారీ రుసుమైన రూ.500 కట్టనవసరం లేదని, కార్డు యాక్టివేషన్ కాగానే వినియోగదారునికి 350 బోనస్ పాయింట్లు లభిస్తాయని తెలిపారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఈ కార్డు ద్వారా ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్, ఏసీ ఛైర్ కార్ టికెట్లను బుకింగ్ చేసుకుంటే 10 శాతం నగదు కూడా వెనక్కి వస్తుంది. ఆన్‌లైన్ లావాదేవీ రుసుం రద్దు, ఇంధన సర్‌ఛార్జీలో 1% మినహాయింపు లాంటివి కూడా పొందొచ్చు.
ఇదీ చూడండి: మూడో త్రైమాసికం నుంచి మళ్లీ నెమ్మదే: ఆక్స్ఫర్డ్