దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ఆదివారం 28 పైసలు పెరిగి.. రూ.83.41 వద్దకు చేరింది. డీజిల్ ధర లీటర్కు 29 పైసలు పెరిగి.. రూ.73.62 వద్ద ఉంది.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలకు తగ్గట్లు.. చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తుండటం ఇందుకు కారణం.
నవంబర్ 20 నుంచి పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచటం ఇది 14వ సారి.
దేశవ్యాప్తంగా ఇతర మెట్రో నగరాల్లోనూ.. లీటర్ పెట్రోల్ ధర 24 పైసల నుంచి అత్యధికంగా 29 పైసల వరకు పెరిగింది. డీజిల్ ధరను లీటర్కు కనిష్ఠంగా 27 పైసల నుంచి గరిష్ఠంగా 32 పైసల వరకు పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.
ప్రధన నగరాల్లో ఇంధన ధరలు (లీటర్కు)
నగరం | పెట్రోల్ | డీజిల్ |
హైదరాబాద్ | రూ.86.71 | రూ.80.28 |
బెంగళూరు | రూ.86.16 | రూ.78 |
ముంబయి | రూ.90.01 | రూ.80.20 |
చెన్నై | రూ.86.21 | రూ.78.93 |
కోల్కతా | రూ.84.86 | రూ.77.15 |
ఇదీ చూడండి:ఓ ఉద్యోగి నిష్క్రమణతో గూగుల్లో దుమారం!