కరోనా సంక్షోభం కారణంగా సాఫ్ట్వేర్ దిగ్గజం విప్రో.. ఉద్యోగుల జీతాల్లో కోతలు ఉంటాయన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు కంపెనీ ప్రతినిధులు. తమ కంపెనీలో పలు ప్రాజెక్టుల్లో పని చేస్తున్న సీనియర్ ఉద్యోగులు, కొత్త ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తోన్న వారి జీతాల్లో ఎలాంటి కోతలు విధంచబోమని, ప్రస్తుతం అలాంటి ప్రణాళికలేమీ లేవని 'ఈటీవీ భారత్'తో వెల్లడించారు..
విప్రోలో సుమారు 300 మంది ఉద్యోగులను తొలగించిందని.. పుణె కార్మిక శాఖ.. ఆ కంపెనీకి నోటీసులు జారీచేసినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ నోటీసులపై 'ఈటీవీ భారత్' వివరణ కోరగా.. ఈ-మెయిల్ ద్వారా స్పందించింది విప్రో.
పుణె కార్మిక శాఖ నోటీసులకు సంబంధించి..
కార్మిక శాఖ నుంచి తమకు ఎలాంటి నోటీసులు అందిలేదని.. అవసరమైనప్పుడు కంపెనీకి సంబంధించిన నిజాలను అధికారుల ముందు ఉంచుతామని మెయిల్లో తెలిపారు విప్రో ప్రతినిధులు
ఇదీ చదవండి: ఈ ఏడాది అందుబాటులోకి 'శాంసంగ్ పే డెబిట్ కార్డ్'