ETV Bharat / business

3 నెలల్లో విమానయాన రంగం రికవరీ!

author img

By

Published : Jan 8, 2021, 11:58 AM IST

కరోనా సంక్షోభం నుంచి దేశీయ విమానయాన రంగం రికవరీ అవుతున్నట్లు పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా వెల్లడించారు. దీనితో విమానయాన రంగం మరో రెండు మూడు నెలల్లో సాధారణ స్థితికి రావచ్చని అంచనా వేశారు.

Indian Aviation Recovering from Corona crisis
కరోనా నుచి కోలుకుంటున్న విమాన రంగం

దేశీయ విమానయాన రంగం వచ్చే 2- 3 నెలల్లో సాధారణ స్థితికి వస్తుందని పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్​ సింగ్ ఖరోలా ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వల్ల ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల నుంచి కొలుకుంటున్న ప్రధాన రంగాల్లో విమానయానం కూడా ఒకటని ఫిక్కీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సదస్సులో వెల్లడించారు.

కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్ కారణంగా 2020 మార్చి 25న విమాన సేవలను నిలిపివేసింది కేంద్రం. దీనితో విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలోకి జారుకుంది. మే 25 నుంచి దశల వారీగా సేవలను పునరుద్ధరించింది.

భారత ఎయిరోస్పేస్​ భవిష్యత్​కు.. రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమైన పాత్ర పోషించాలన్నారు ఖరోలా. రాష్ట్రాల్లో ఎయిరోస్పేస్​ యూనిట్లు ఉండాలని పేర్కొన్నారు.

డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్​ (డీజీసీఏ) డేటా ప్రకారం.. అన్​లాక్​తో నవంబర్​లో ప్యాసింజర్ లోడ్​ పెరిగినట్లు తెలిసింది.

ఇదీ చూడండి:ప్రపంచ కుబేరుడిగా ఎలాన్​ మస్క్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.