ETV Bharat / business

మీ ఆరోగ్య బీమాలో 'డెంగీ' రైడర్ ఉందా...? - ​హాస్పిటల్ క్యాష్​ బెనిఫిట్​:

దేశంలో ఇప్పుడిప్పుడే ఆరోగ్య బీమాపై అవగాహన పెరుగుతోంది. అయితే ఆరోగ్య బీమా ఎంచుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ప్రాథమిక ప్లానును అనుసరించి వస్తున్న రైడర్స్​నూ తీసుకుంటే అత్యధిక లాభాలుంటాయని తెలియజేస్తున్నారు నిపుణులు.

మీ ఆరోగ్య బీమాలో 'డెంగీ' రైడర్ ఉందా...?
author img

By

Published : Sep 16, 2019, 3:17 PM IST

Updated : Sep 30, 2019, 8:10 PM IST

గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆరోగ్య బీమాపై మన దేశంలో అవగాహన పెరిగింది. అయితే సరైన పథకాలు ఎంచుకోవటంలో విఫలమవుతున్నారు భారతీయులు.

అనుకోకుండా మనకు ఏదైనా జరిగితే మన కుటుంబానికి ఆర్థికంగా భరోసానిచ్చేదే బీమా. సరైన బీమా పథకాన్ని ఎంచుకుంటే అది మీతో పాటు, మీ కుటుంబానికి అండగా నిలుస్తుంది. అందుకే ఆరోగ్య బీమా ఎంచుకునే సమయంలో జాగ్రత్తలు వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదే సమయంలో ఆరోగ్య బీమాలో నూతనంగా ప్రవేశపెట్టిన రైడర్స్​(యాడ్​-ఆన్స్​) పైనా అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నారు. ఈ రైడర్స్ వల్ల మనం తీసుకునే పథకం మరింత ఉపయోగాలను ఇస్తుంది.

రైడర్స్​ అంటే...?

మనం తీసుకున్న ప్రాథమిక ప్లానుకు అదనపు కవరేజీనిచ్చేవే రైడర్లు. అంటే ఒక విధంగా వీటిని యాడ్​-ఆన్స్​ అనొచ్చు. ఐఆర్​డీఎఐ ప్రకారం ప్రాథమిక ప్లాన్​ ధరలో 30 శాతం ధర వరకు రైడర్స్​ని పొందవచ్చు.

బీమా సంస్థలు అందిస్తున్న ముఖ్యమైన రైడర్స్

హాస్పిటల్ క్యాష్​ బెనిఫిట్​:

రైడర్స్​లో బాగా ప్రాముఖ్యం చెందినది 'హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్'. దీనిని మధ్యతరగతి రైడర్​గా పేర్కొంటారు. అకస్మాత్తుగా ఆసుపత్రి పాలయినప్పుడు డబ్బు పొందటానికి ఈ రైడర్​ అవకాశం కల్పిస్తుంది.
మీరు ఎలాంటి బీమా పథకం కింద ఆసుపత్రిలో చేరినా పథకంతో సంబంధం లేకుండా డబ్బు చేతికి అందటం ఈ రైడర్​ ప్రత్యేకత.

ఉదాహరణకు మీరు ఆసుపత్రిలో చేరితే రోజువారీ ఆసుపత్రి ఖర్చు 2000 అయితే ఈ రైడర్​ కింద ప్రతిరోజు 1000 రూపాయిలు మీ చేతికి అందుతాయి.

ఈ రైడర్​ కింద డబ్బు పొందటానికి అర్హత సాధించాలంటే మీరు రెండురోజుల కంటే ఎక్కువగా ఆసుపత్రిలో ఉండాలి. ఐసీయూ లాంటి అత్యవసర చికిత్సలకైతే ఈ రైడర్​ ద్వారా రోజుకు రెండు సార్లు డబ్బు పొందొచ్చు.

ఒకవేళ ప్రత్యేకమైన సర్జరీ జరిగితే దానికి సంబంధించిన పూర్తి డబ్బును పొందొచ్చు. ఒకటి కంటే ఎక్కువ సర్జరీలు చేయించుకున్నట్లయితే అత్యధిక ఖర్చు అయిన ఒక్క సర్జరీకి మాత్రమే డబ్బు అందిస్తుంది రైడర్​.

క్యాన్సర్ కేర్ ప్లాన్:

బీమా అనేది ఆసుపత్రి ఖర్చులకు మాత్రమే డబ్బు అందిస్తుంది. దీనికీ ఐదు లక్షల వరకు పరిమితి ఉంది. ఇంతకు మించి సొమ్మును అందించదు. కొన్ని ప్రత్యేకమైన వ్యాధులకు ప్రత్యేక ప్యాకేజీలు అందించే రైడర్స్​ ఉన్నాయి. అలాంటిదే క్యాన్సర్​ సంరక్షణ ప్రణాళిక. ఆసుపత్రి ఖర్చులతో పాటు అదనపు ఖర్చులను అందిస్తుంది ఈ రైడర్​. క్యాన్సర్​ చికిత్సకు ప్రస్తుతం భారతదేశంలో అయ్యే ఖర్చు సూమారు 15 లక్షలకు పైమాటే.

ప్రస్తుతం ఆదిత్య బిర్లా అందించే క్యాన్సర్​ రైడర్​ ప్లాన్​కు మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉంది. ఈ ప్లానులో క్యాన్సర్​ మొదటి దశలో 50 శాతం సొమ్ముని అందిస్తారు. తరువాత 100 శాతం సొమ్ముని అందిస్తారు.

ఓడీపీ కవర్​:

వైద్య ఖర్చుల నిమిత్తం సగటు భారతీయుడు తన ఆదాయంలో 62 శాతం ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది ఓ సర్వే. అవసరమైన సమయంలో మీ వద్ద సొమ్ము లేకపోయునట్లయితే ఓడీపీ రైడర్​ మీకు కావాల్సినంత డబ్బును అందిస్తుంది. ఓడీపీ అంటే ఔట్​ పేషెంట్​ డిపార్ట్​మెంట్​. ఇందులో మందుల ఖర్చులు, వైద్య పరీక్షలకయ్యే ఖర్చులను సైతం అందిస్తారు.

ప్రస్తుతం అపోలో మూనిచ్​, మ్యాక్స్​ బుపా సంస్థలు ఈ రైడర్​ని అందిస్తున్నాయి.

డెంగీ నుంచి రక్షణ

దేశంలో డెంగీ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీని చికిత్సకయ్యే ఖర్చూ అధికమే. ఇది దృష్టిలో పెట్టుకునే దీని కోసం ప్రత్యేకంగా రైడర్​ని అందిస్తున్నాయి కొన్ని సంస్థలు. ఆసుపత్రి,మందుల ఖర్చులను ఈ రైడర్​ కింద అందిస్తారు. చికిత్స పొందే ప్రదేశాన్ని బట్టి 35 వేల నుంచి 70 వేల వరకు డబ్బుని అందిస్తారు.

- అమిత్​ చాబ్రా, ఆరోగ్య విభాగ హెడ్​, పాలసీ బజార్

New Delhi, Sep 16 (ANI): Telangana Governor Tamilisai Soundararajan met Vice President M Venkaiah Naidu in the national capital on September 16. Tamilisai Soundararajan took oath as Telangana Governor on September 08. She has earlier served as chief of Bharatiya Janata Party unit of Tamil Nadu. Venkaiah Naidu's wife Usha Naidu was also present on this occasion.
Last Updated : Sep 30, 2019, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.