ETV Bharat / business

అమెజాన్​లో​ 'ఫోన్​ ఫెస్ట్​'- వన్​ప్లస్​పై భారీ డిస్కౌంట్!

ఫ్యాబ్​ ఫోన్​ ఫెస్ట్​ పేరిట అమెజాన్ ఇండియా బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 22 నుంచి 25 వరకు నిర్వహిస్తోన్న ఈ ప్రత్యేక సేల్​లో హైఎండ్​ మొబైల్ అయిన​ వన్​ప్లస్8టీ పై ప్రత్యేక తగ్గింపుతో పాటు.. 10 శాతం రాయితీ​ ఇవ్వనుంది. అదే విధంగా ఇతర మొబైల్స్​​పైనా ఆఫర్లను ప్రకటించింది. పూర్తి వివరాలు మీ కోసం..

Amazon Fab Phone Fest Begins: Price Cut on OnePlus 8T, More Phones
అమెజాన్​లో​ 'ఫోన్​ ఫెస్ట్​'- వన్​ప్లస్​పై భారీ డిస్కౌంట్!
author img

By

Published : Mar 22, 2021, 5:04 PM IST

Updated : Mar 22, 2021, 6:14 PM IST

'ఫ్యాబ్ ఫోన్​ ఫెస్ట్​' రెండో ఎడిషన్​లో మొబైల్​ ఫోన్లపై సరికొత్త ఆఫర్లు, డిస్కౌంట్‌లను​ ప్రకటించింది అమెజాన్. ఎంపిక చేసిన మొబైళ్లపై నో-కాస్ట్ ఈఎంఐ సహా.. ఎక్స్ఛేంజ్ ఆఫర్లూ వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. ఇది మార్చి 22 నుంచి 25 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఈ ​ఫోన్లపై 'స్మార్ట్' ఆఫర్లు..

  • వన్‌ప్లస్ 8టీపై గరిష్ఠంగా రూ.2,500 తగ్గింపును ప్రకటించింది అమెజాన్. 8 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.40,499కాగా.. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్‌కు రూ.43,499 రూపాయలుగా ఉంది. అదే విధంగా వన్‌ప్లస్ 8ప్రో వేరియంట్​పై గరిష్ఠంగా రూ.3,500 తగ్గింపును ప్రకటించింది.
  • రెడ్‌మీ 9ఎ, రెడ్‌మీ 9ప్రైమ్, వన్‌ప్లస్ 8టీ, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం-21 సహా.. ఇతర స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లను ప్రకటించింది. రెడ్‌మీ నోట్ 9ప్రో మాక్స్ వంటి మోడళ్లపైనా రూ.2,000 వరకు తగ్గింపు ఉండనుంది.
  • 2020లో విడుదలైన ఒప్పో ఎ31 ఫోన్​ను ఎక్సేంజీ చేసుకోవచ్చని అమెజాన్ తెలిపింది. 4జీబీ+ 64జీబీ వేరియంట్​కు గరిష్ఠంగా రూ.9,990, 6జీబీ, 128జీబీ మోడల్​కు రూ.11,990 వరకు చెల్లించనున్నట్టు అమెజాన్ వివరించింది.
  • శామ్‌సంగ్ గెలాక్సీ ఎం51 ఫోన్​పై రూ.1,250 వరకూ తగ్గింపు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

10 శాతం డిస్కౌంట్ పొందండిలా..

అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తగ్గింపును అందించనుంది. యాక్సిస్ బ్యాంకు, సిటీ బ్యాంకుల భాగస్వామ్యంతో 10 శాతం డిస్కౌంట్​ ఇస్తోంది. ఆయా సంస్థలకు చెందిన క్రెడిట్, డెబిట్​ కార్డులతో కొనుగోళ్లు జరపడం ద్వారా ఈ ఆఫర్లు పొందొచ్చు. రూపే కార్డులతో జరిపే లావాదేవీలకూ ఈ ఆఫర్​ వర్తించనుంది.

ఇదీ చదవండి: 110 వర్క్​అవుట్​ మోడ్​లతో వన్​ప్లస్​ స్మార్ట్​ వాచ్​

Last Updated : Mar 22, 2021, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.