రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఎండ, వాన దోబూచులాడాయి. మిట్ట మధ్యాహ్నం బాగా ఎండగా ఉన్న సమయంలో ఒక్కసారిగా చిరు జల్లులు కురిశాయి. రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. యాచారం మండలం మాల్లో పెద్ద పరిమాణంలో వడగళ్లు పడ్డాయి.
ఆదిలాబాద్ జిల్లా బేలలో రాష్ట్రంలోనే గరిష్ఠంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిరిసిల్ల జిల్లా రుద్రాంగిలో 42.8, జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 42.7, నిర్మల్ జిల్లా పెంబి, ఖానాపూర్, కరీంనగర్ జిల్లా జమ్మికుంట, రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి, గజ సింగారంలో 42.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం తెలిపింది.
మాల్ 10 కిలోల మంచుగడ్డ
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్లో దాదాపు పది కిలోల మంచురాయి పడింది. వడగళ్ల వానల వల్ల మామిడి తోటలకు నష్టం వాటిల్లింది.
ఇవీ చూడండి: 'సొంతంగానే మెజార్టీ సాధిస్తాం- సుస్థిర పాలన అందిస్తాం'