తెలంగాణ వరప్రదాయనిగా పిలిచే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఉదయమే జగిత్యాల జిల్లా రాంపూర్‌కి చేరుకున్నారు. అక్కడ ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పంప్‌హౌజ్ పనులు పరిశీలించారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజికి వెళ్లారు. అక్కడ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్ సీఎంకు ఘనస్వాగతం పలికారు. రెండు గంటల పాటు ప్రాజెక్టు పరిసర ప్రాంతమంతా తిరుగుతూ పనులను పరిశీలిస్తున్నారు. ఎండను కూడా లెక్కచేయకుండా బురదలో, నీళ్లలో చాలా దూరం నడిచారు. బ్యారేజి పనులను పరిశీలించిన తర్వాత కేసీఆర్... పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులు, ఇంజినీర్లకు దిశానిర్దేశం చేశారు. రెండు వారాల వ్యాధిలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి మేడిగడ్డ బ్యారేజిని సందర్శించడం గమనార్హం.
ఇవీ చూడండి: బ్యాలెట్‌పత్రాలకు చెదలు... ఫలితాల నిలిపివేత