నేటితో మొదటి విడత పరిషత్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. 2097 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 6న ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. టీవీ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు చేయకూడదని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. సాయంత్రం తర్వాత ప్రచారానికి వచ్చిన స్థానికేతరులందరూ ఆయా ప్రాంతాలు వదిలి వెళ్లాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రెండేళ్ల వరకు జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తామని ఈసీ హెచ్చరించింది.
ఇవీ చూడండి: కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నిరంజన్‌రెడ్డి