బాలీవుడ్ ప్రేమజంట అలీ ఫజల్, రిచా చద్దా వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ మ్యూజిక్ ఫ్లాట్‌ఫామ్ స్పాటిఫై రూపొందించిన ఓ పాడ్‌కాస్ట్‌లో భాగమయ్యారు. 'వైరస్ 2062' టైటిల్‌తో రానున్న ఈ ఆడియో థ్రిల్లర్‌లో వీరిద్దరూ తమ గొంతులతో అలరించనున్నారు. ఈ విషయాన్ని అలీ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశాడు.
"త్వరలో వస్తున్నాం. ఈ పాడ్‌కాస్ట్ కోసం నా గత ట్వీట్స్ అన్నింటినీ రిఫరెన్స్‌గా తీసుకున్నాం. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. ఈ పాడ్‌కాస్ట్ విన్నాక మీకే అసలు విషయం అర్థమవుతుంది. ఇది 2062 కథ" అంటూ రిలీజ్ డేట్ పోస్టర్‌ను ట్విట్టర్లో షేర్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చాడు ఫజల్. ఈ సిరీస్‌లోని అన్ని ఎపిసోడ్లు శుక్రవారం స్పాటిఫైలో రిలీజ్ కానున్నాయి.
-
Coming soon! All my tweets are in reference to the podcast. Please dont misconstrue. You will understand when you hear it. 2062 ki kahaani hai. pic.twitter.com/fgvvFWAr69
— Ali Fazal M / میر علی فضل / अली (@alifazal9) September 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Coming soon! All my tweets are in reference to the podcast. Please dont misconstrue. You will understand when you hear it. 2062 ki kahaani hai. pic.twitter.com/fgvvFWAr69
— Ali Fazal M / میر علی فضل / अली (@alifazal9) September 1, 2021Coming soon! All my tweets are in reference to the podcast. Please dont misconstrue. You will understand when you hear it. 2062 ki kahaani hai. pic.twitter.com/fgvvFWAr69
— Ali Fazal M / میر علی فضل / अली (@alifazal9) September 1, 2021
అలీ ఫజల్, రిచా చద్దా ప్రస్తుతం 'గర్ల్ విల్ బీ గర్ల్స్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను వీరే స్వయంగా నిర్మిస్తున్నారు. అలాగే రిచా ఇటీవలే 'మేడమ్ చీఫ్ మినిస్టర్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుభాష్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరిలో విడుదలైంది. అలాగే జీ5లో విడుదలైన 'లాహోర్ కాన్ఫిడెన్షియల్'లోనూ కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం 'ఫక్రే 3', 'కాండీ', 'అభీ తో పార్టీ షురూ హువా హై' చిత్రాలు చేస్తోంది.
అలీ ఫజల్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'రే'తో చివరిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం రిచాతో కలిసి 'ఫక్రే 3'లో నటిస్తున్నాడు. అలాగే ఇతడు నటించిన హాలీవుడ్ చిత్రం 'డెత్ ఆన్ ద నైల్' త్వరలోనే విడుదల కానుంది. ఇందులో గాల్ గాడోట్, అన్నెట్టే బెనింగ్, రస్సెల్ బ్రాండ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇక అలీ,రిచా మ్యారేజ్ విషయానికొస్తే గతేడాది ఏప్రిల్‌లోనే ఈ వార్త చక్కర్లు కొట్టినా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది.