ETV Bharat / sitara

డ్రగ్స్ కేసు: నటుడు అర్మాన్ కోహ్లీ ఇంట్లో ఎన్​సీబీ సోదాలు

Armaan Kohli
అర్మాన్ కోహ్లీ
author img

By

Published : Aug 28, 2021, 6:21 PM IST

Updated : Aug 28, 2021, 6:56 PM IST

18:18 August 28

నటుడు, మాజీ బిగ్​బాస్ కంటెస్టెంట్ అర్మాన్ కోహ్లీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. మాదక ద్రవ్యాల కేసులో ఇతడి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఎన్​సీబీ అధికారులు. ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో కీలక సమాచారం సేకరించే క్రమంలోనే తనికీలు నిర్వహిస్తున్నారు.

2018లో ఇంట్లో 41 స్కాచ్ విస్కీ బాటిల్స్ స్టాక్​గా పెట్టుకున్నందుకు ఎక్సైజ్ శాఖ​ ఇతడిపై కేసు నమోదు చేసింది. ఇందులో విదేశీ మద్యం కూడా ఉంది. నిబంధనల ప్రకారం ఇంట్లో 12కు మించి మద్యం బాటిల్స్​ను ఉంచరాదు. కానీ ఇతడు నిబంధలు అతిక్రమించిన కారణంగా ఇతడిని అరెస్ట్ కూడా చేశారు.  

గతంలో అర్మాన్​పై అతడి గర్ల్ ఫ్రెండ్ నీరు రాంధ్వ కేసు పెట్టింది. తనను శారీరకంగా హింసించినట్లు ఆరోపించింది. ఈ విషయంలో వారం రోజుల పాటు పరారీలో ఉన్న ఇతడిని లోనావాలా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఆ తర్వాత ఈ కేసును నీరు ఉపసంహరించుకుంది.

ఇక సినిమాల విషయానికొస్తే అర్మాన్.. 'జానీ దుష్మన్', 'ప్రేమ్ రతన్ ధన్​పాయో' వంటి తదితర చిత్రాల్లో నటించాడు.

Last Updated : Aug 28, 2021, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.