ప్రజా ప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను విచారణ జరపనుంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు స్వయంగా ఈ కేసులను విచారణ చేపట్టనున్నారు.
మంగళవారం హైకోర్టు మొదటి ధర్మాసనంలో కేసులను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ జరపనున్నారు. రెండో ధర్మాసనంలో జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ జి.శ్రీదేవి విచారణ జరపనున్నారు.
ఇదీ చదవండి: SABITHA INDRA REDDY: విద్యా సంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయం