ETV Bharat / bharat

'ఆ సరస్సు​తో ఇక ప్రమాదం లేదు'

ఉత్తరాఖండ్​ జల ప్రళయంతో ఏర్పడిన కృత్రిమ సరస్సు వల్ల ఇక ఏ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ సరస్సు నుంచి నీరు క్రమంగా తగ్గుతోందని తెలిపారు.

uttarakhand lake
'ఆ సరస్సు​తో ఇక ప్రమాదం లేదు'
author img

By

Published : Feb 13, 2021, 10:20 PM IST

రుషి గంగ జన్మస్థలంలో కొత్తగా ఏర్పడిన సరస్సులో నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. ఈ మేరకు ఉత్తరాఖండ్​ డీజీపీ అశోక్​ కుమార్ తెలిపారు. ఇక ఈ సరస్సు వల్ల ప్రమాదం ఏమీ లేదని ఆయన​ స్పష్టం చేశారు. అంతకుమందు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం ఈ సరస్సు వద్ద పరిస్థితిని సమీక్షించింది.

  • #WATCH I Uttarakhand: State Disaster Response Force team reviewed situation at the lake that has been formed upstream of near Raini village, near Tapovan, earlier today.

    "Water is continuously discharging from the lake, it's not in danger zone," as per Ashok Kumar, State DGP pic.twitter.com/oXthueuetE

    — ANI (@ANI) February 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మంచు చరియలు కరగడంతో ఈ తాత్కాలిక సరస్సు ఏర్పడింది. ఈ సరస్సు గట్టు తెగితే తొలుత రుషి గంగలో, అనంతరం ధౌలీ గంగలో ఆకస్మికంగా నీరు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే తపోవన్​ ప్రాంతంలో సహాయక చర్యలకు ఇబ్బందులు కలుగుతాయని భావిస్తున్నారు.

కాగా.. తపోవన్​ విద్యుత్​ కేంద్రం సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగతున్నాయి. డ్రిల్లింగ్ ఆపరేషన్​ ద్వారా ఎట్టకేలకు తపోవన్ సొరంగానికి రంధ్రం చేయగలిగారు. దీంతో సుదీర్ఘ సహాయక చర్యల్లో ముందడుగు పడినట్టైంది. ఇప్పటికి 300 మిల్లీ మీటర్ల మేర వ్యాసంతో రంధ్రాన్ని చేసినట్లు ఎన్​టీపీసీ ప్రాజెక్టు జనరల్​ మేనేజర్​ ఆర్​పీ అహిర్వాల్​ తెలిపారు. 12 మీటర్ల వ్యాసంతో ఈ రంధ్రాన్ని ఇంకా పెద్దదిగా చేస్తామని చెప్పారు.

ఇవీ చదవండి:

ఆపరేషన్​ తపోవన్​: సొరంగానికి రంధ్రం

జల విలయం: ఒక్క ఫోన్​కాల్​తో కొండంత భరోసా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.