దేశంలో కరోనా విజృంభణ దృష్ట్యా.. వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. టీకా డోసుల పంపిణీ 15 కోట్ల మార్కుకు చేరువలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. బుధవారం ఒక్కరోజే(రాత్రి 8 గంటల వరకు) 20లక్షల 49వేల టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 11,92,394 మందికి మొదటి డోసు అందించినట్లు, 8,57,754 మందికి రెండో డోసును అందించినట్లు వివరించింది.
దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 14,98,77,121 టీకా డోసులను అందించినట్లు పేర్కొంది.
జనవరి 16న దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్ ప్రారంభమైంది.
రికవరీ రేటు 82.33 శాతం
మరోవైపు దేశవ్యాప్తంగా కొవిడ్ రికవరీ రేటు ప్రస్తుతం 82.33 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరణాల రేటు 1.12 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి : ఈసీ మార్గదర్శకాల్లో స్పష్టత లేదు: టీఎంసీ