ETV Bharat / bharat

ఆ రాష్ట్రాల బడ్జెట్​ సమావేశాల్లో కరోనా కలకలం - ఛత్తీస్​గఢ్​ మంత్రులకు కరోనా

మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కరోనా కలకలం రేపింది. అసెంబ్లీలో మొత్తం 36 మందికి వైరస్​ బారినపడ్డారు. ఛత్తీస్​గఢ్​లో ఇటీవల బడ్జెట్​ సమావేశాలు ముగియగా.. అందులో పాల్గొన్న ఇద్దరు రాష్ట్ర మంత్రలకు కొవిడ్​ సోకింది.

Thirty Six people test COVID-19 positive in Maharashtra legislative assembly
ఆ రాష్ట్రాల బడ్జెట్​ సమావేశాల్లో కరోనా కలకలం
author img

By

Published : Mar 8, 2021, 4:18 PM IST

మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో కరోనా వైరస్​ కలకలం సృష్టించింది. మొత్తం 36 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయినట్టు ముంబయిలోని జేజే ఆస్పత్రి వర్గాలు సోమవారం తెలిపాయి.

మహారాష్ట్రలో మార్చి 1న బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల 6,7న అక్కడ కొవిడ్​ పరీక్షలు నిర్వహించారు. అందులో భాగంగా 2,746 నమూనాలను పరీక్షించగా.. 36 వైరస్​ కేసులు వెలుగుచూశాయి. మొత్తంగా వారం రోజుల వ్యవధిలో 3,900 శాంపిల్స్​ను పరీక్షించగా.. 42మందికి పాజిటివ్​గా తేలింది.

ఛత్తీస్​గఢ్​లోనూ..

ఛత్తీస్​గఢ్​ ఆరోగ్య మంత్రి టీఎస్​ సింగ్​ దేవ్, రెవెన్యూ మంత్రి జైసింగ్​ అగర్వాల్​కు కరోనా సోకినట్టు తేలింది. గత వారం జరిగిన అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలకు ఈ ఇద్దరు మంత్రులు హాజరయ్యారు.

ఆ రాష్ట్రంలో గతవారం ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వైరస్​ బారినపడ్డారు.

ఇదీ చదవండి: అసెంబ్లీకి మహిళా ఎమ్మెల్యే గుర్రపు స్వారీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.