తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎం.కే స్టాలిన్ను నియమించారు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు.
స్టాలిన్, డీఎంకే జనరల్ సెక్రటరీ దురైమురుగన్, టీ ఆర్ బాలు, ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎన్ నెహ్రూ గవర్నర్ను కలిశారు. డీఎంకే శాసనసభాపక్ష నేతగా స్టాలిన్ను ఎన్నుకున్నట్లు లేఖ అందించారు. అనంతరం గవర్నర్ స్టాలిన్ను ముఖ్యమంత్రిగా నియమించారు. మే 7న ఉదయం 9గంటలకు రాజ్భవన్లో స్టాలిన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇదీ చదవండి : ప్రభుత్వ ఏర్పాటుకు స్టాలిన్ను ఆహ్వానించిన గవర్నర్