ETV Bharat / bharat

స్పైస్​జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్! ఒకే రోజులో రెండు..17 రోజుల్లో ఏడు

Spicejet landing in mumbai: కాండ్ల నుంచి ముంబయి వెళ్తున్న స్పైస్​జెట్​ విమానం విండ్​షీల్డ్ దెబ్బతినడం వల్ల అత్యవసరంగా ల్యాండ్​ చేశారు. ఉదయమే దిల్లీ నుంచి దుబాయ్​ వెళ్తున్న విమానాన్ని అత్యవసరంగా కరాచీకి మళ్లించారు. ఈ ఘటనలపై విచారణ చేపట్టినట్లు డైరెక్టరేట్ జనరల్​ ఆఫ్ సివిల్ ఏవియేషన్​(డీజీసీఏ) తెలిపింది.

spicejet latest news
spicejet latest news
author img

By

Published : Jul 5, 2022, 8:30 PM IST

Spicejet landing in mumbai: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్​జెట్​కు చెందిన విమానాలు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. మంగళవారం ఉదయం దిల్లీ నుంచి దుబాయ్​ వెళ్తున్న విమానాన్ని సాంకేతిక సమస్యలతో అత్యవసరంగా కరాచీలో ల్యాండ్​ చేశారు. ఈ ఘటన మరవకముందే మరో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్​ చేశారు. కాండ్ల నుంచి ముంబయికి ప్రయాణిస్తున్న విమాన విండ్​షీల్డ్​ దెబ్బతినడం వల్ల ముంబయిలో ల్యాండ్​ చేశారు.

ఈ ఘటనపై స్పైస్​జెట్​ స్పందించింది. విండ్​షీల్డ్ దెబ్బతినడం వల్ల పైలట్లు అత్యవసరంగా ల్యాండ్ చేశారని.. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని తెలిపింది. ఒకే రోజులో రెండు ఘటనలు జరిగాయని.. గత 17 రోజుల్లో ఇది ఏడో ప్రమాదమని అధికారులు చెప్పారు. ఈ ఘటనలపై విచారణ చేపట్టినట్లు డైరెక్టరేట్ జనరల్​ ఆఫ్ సివిల్ ఏవియేషన్​(డీజీసీఏ) తెలిపింది.

మంగళవారం ఉదయం.. దిల్లీ నుంచి దుబాయ్​ వెళ్తున్న స్పైస్​జెట్​ విమానాన్ని పాకిస్థాన్​లోని కరాచీకి మళ్లించాల్సి వచ్చింది. ఫ్యూయల్ ఇండికేటర్ సరిగా పనిచేయకపోవడమే ఇందుకు కారణం. స్పైస్​జెట్​కు చెందిన ఎస్​జీ-11 విమానం 150 మంది ప్రయాణికులతో దిల్లీ నుంచి దుబాయ్​కు బయలుదేరింది. అయితే.. ఫ్యూయల్ ఇండికేటర్ పనిచేయడం లేదని గుర్తించిన పైలట్లు.. ముందు జాగ్రత్తగా విమానాన్ని ల్యాండ్ చేయాలని భావించారు. దగ్గర్లోని కరాచీ ఎయిర్​పోర్ట్ ఏటీసీని సంప్రదించారు. వారి సూచనల మేరకు విమానాన్ని ల్యాండ్ చేశారు.

ఇదీ చదవండి: రాజ్యాంగంపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. లైట్ తీసుకోమన్న అధికార పార్టీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.