స్వాతంత్య్ర వేడుకలకు దేశం సిద్ధమవుతున్న వేళ భద్రతకు సంబంధించి కీలక విషయాలు వెల్లడంచారు జమ్ముకశ్మీర్ డైరెక్టర్ జరనల్ దిల్బాగ్ సింగ్. పాకిస్థాన్‌కు చెందిన లష్కర్-ఏ-తోయిబా(ఎల్ఈటీ), జైష్-ఏ-మహమ్మద్(జేఈఎం) వంటి ఉగ్రసంస్థలు.. జమ్ముకశ్మీర్‌పై భారీ దాడులకు తెగబడేందుకు కుట్రలు పన్నుతున్నాయని చెప్పారు. అయితే.. అలాంటి చర్యలను తిప్పికొట్టేందుకు భద్రతా బలగాలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయని పేర్కొన్నారు.
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు కొనసాగుతున్నాయనని దిల్బాగ్ సింగ్ తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం యువకులను ఆకర్షించే యత్నాలను భద్రతా బలగాలు భగ్నం చేస్తున్నాయని చెప్పారు.
"పాకిస్థాన్‌కు చెందిన ఎల్ఈటీ, హిజ్బుల్ ముజాహిద్దీన్, జేఈఎం వంటి ఉగ్రసంస్థలు.. జమ్ముకశ్మీర్‌లో భారీ దాడులకు పాల్పడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. అలాంటి కార్యకలపాలకు పాల్పడకుండా మా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. భద్రతా వర్గాలు, ఇతర నిఘా వర్గాలతో పోలీసులు కలిసి పని చేస్తున్నారు. ఉగ్రవాదుల దుస్సాహసాలను తిప్పికొట్టగలమని నాకు నమ్మకం ఉంది."
-దిల్బాగ్ సింగ్, జమ్ముకశ్మీర్ డీజీపీ
మంగళవారం రాజౌరీలో పర్యటించిన దిల్బాగ్ సింగ్.. బుధవార కిష్ట్వార్ చేరుకున్నారు. స్వాతంత్ర్య వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర ఏరివేత కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు.
ఇదీ చూడండి: 'ఆహారం వృథా చేయటం అంటే పేదలను దోచుకోవటమే'
ఇదీ చూడండి: ఆ దేశాల నుంచే ఎక్కువ పోర్న్.. మన స్థానం ఎంతంటే?