కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. రక్షణ శాఖ నిర్వహించిన పార్లమెంటరీ స్థాయి సంఘంలో.. పెండింగ్‌లో ఉన్న 'ఒకే ర్యాంకు ఒకే పింఛన్(ఓఆర్ఓపీ)' విషయమై ప్రశ్నలు లేవనెత్తారు. అయితే.. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న విధానంలో పరిష్కరించాల్సిన సమస్యలు మరికొన్ని ఉన్నాయని రక్షణ శాఖ అధికారులు ప్యానెల్‌కు సమాధానమిచ్చారు. వీటిని పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశామని.. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా సమీక్షిస్తామని తెలిపారు.
సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ సహా ముగ్గురు సాయుధ దళాల ఉన్నతాధికారులు, రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ గురువారం ప్యానెల్ ఎదుట పదవీ విరమణ పొందారు. భాజపా సీనియర్ నాయకుడు జుయల్ ఓరమ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో.. ఛైర్మన్, రాహుల్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే.. ఈ సమావేశం ఎజెండాలో లేదని ఛైర్మన్ చెప్పడం వల్ల అంతటితో వాగ్వాదానికి తెరపిడినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం శుక్రవారం ఓ మర్యాదపూర్వక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
40ఏళ్లుగా పెండిగ్లో ఉన్న ఓఆర్ఓపీ అంశాన్ని పునఃపరిశీలించేందుకు గానూ.. గతేడాది జూన్‌లో ఓ కమిటీని ఏర్పాటు చేసింది రక్షణ శాఖ.
ఇదీ చదవండి: 'ఉత్తరాఖండ్' మృతులకు గుర్తుగా స్మృతి వనం