ETV Bharat / bharat

సీబీఐ తాత్కాలిక చీఫ్​​గా ప్రవీణ్​ సిన్హా

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు తాత్కాలిక చీఫ్​గా ప్రవీణ్​ సిన్హా గురువారం నియమితులయ్యారు. ఆయన బాంబు పేలుళ్లు, ఆర్థిక నేరాలు వంటి కీలక కేసుల దర్యాప్తులో ముఖ్య పాత్ర పోషించారని సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు.

praveen sinha, cbi chief
సీబీఐ తాత్కాలిక బాస్​గా ప్రవీణ్​ సిన్హా
author img

By

Published : Feb 4, 2021, 8:15 PM IST

సీబీఐ డైరెక్టర్​గా​ రిషీ కుమార్​ శుక్లా పదవి విరమణ పొందిన నేపథ్యంలో తాత్కాలిక చీఫ్​గా అదనపు డైరెక్టర్​ ప్రవీణ్​ సిన్హా గురువారం బాధ్యతలు చేపట్టారు. 1988 బ్యాచ్​ గుజరాత్​ క్యాడర్​ ఐపీఎస్​ అధికారి అయిన సిన్హా.. ఎస్పీ, డీఐజీ, జాయింట్​ డైరెక్టర్​గా వివిధ విభాగాల్లో విధులు నిర్వహించారు. 2015-18 మధ్య సెంట్రల్​ విజిలెన్స్ కమిషన్​కు​ అదనపు కార్యదర్శిగా పనిచేశారు.

"బ్యాంకు కుంభకోణాలు, ఆర్థిక నేరాలు, బాంబు పేలుళ్లు మొదలైన ముఖ్య కేసుల దర్యాప్తులో సిన్హా కీలక పాత్ర పోషించారు. 2017లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, 2020లో సీబీఐ (క్రైమ్​)ల నియమ నిబంధనలు రూపొందించడంలో ఆయన పాత్ర ఎనలేనిది."

-ఆర్.​సి.జోషి, సీబీఐ అధికార ప్రతినిధి

సంస్కరణలు చేపట్టేందుకు సెంట్రల్​ విజిలెన్స్​ కమిషన్​ ఆధ్వర్యంలో నడిచే వివిధ కమిటీలలో సిన్హా భాగస్వాములని జోషి తెలిపారు. నేర చట్టాలలో సంస్కరణలు చేపట్టేందుకు హాంశాఖ నేతృత్వంలోని కమిటీలో కూడా ఆయన భాగమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : గ్రెటా 'నిరసనల కుట్ర'పై​ దిల్లీ పోలీసుల కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.