ETV Bharat / bharat

27 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీకొడుకులు.. భావోద్వేగంతో కంటతడి

ఉపాధి కోసం దిల్లీకి వచ్చిన ఓ నేపాలీ యువకుడు తప్పిపోయి.. 27 ఏళ్ల తర్వాత తన తల్లిని కలుసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని నోయిడాలో జరిగింది. కుటుంబ సభ్యులతో స్వదేశానికి పంపేందుకు నేపాల్​ ఎంబసీ చర్యలు చేపట్టింది.

Missing youth met his mother
27 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీకొడుకులు
author img

By

Published : Jun 4, 2022, 5:45 PM IST

నేపాల్​కు చెందిన ఓ యువకుడు దిల్లీలో తప్పిపోయి 27 ఏళ్ల తర్వాత తన తల్లిని కలుసుకున్నాడు. నేపాల్​ నుంచి తన మామయ్యతో ఉపాధి కోసం దిల్లీ వచ్చిన క్రమంలో తప్పిపోయాడు. చాలా ఏళ్లుగా అతని కోసం కుటుంబ సభ్యులు వెతికారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. కొద్ది రోజుల క్రితం ఆ యువకుడి గురించి నేపాల్​ ఎంబసీకి సమాచారం అందింది. వివరాలు పరిశీలించిన తర్వాత నేపాల్​లోని అతని కుటుంబంతో కలిపారు అధికారులు.

Missing youth met his mother
27 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీకొడుకులు

ఇదీ జరిగింది: నేపాల్​కు చెందిన రవి అనే యువకుడు 14 ఏళ్ల వయసులో తన మామయ్య టికారామ్​తో కలిసి ఉపాధి కోసం దిల్లీకి వచ్చాడు. కొద్ది రోజులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. ఆ తర్వాత వారు పని చేసే చోటు నుంచి రవి తప్పిపోయాడు. నోయిడా, దాద్రీ అటవీ ప్రాంతంలోని కోట్​ గ్రామానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అతడి ఆరోగ్యం క్షీణించింది. కోట్​ గ్రామంలో ఉండే సంజయ్​ అనే వ్యక్తి రవిని తన ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం కల్పించాడు. 22 ఏళ్ల పాటు వారితోనే ఉండిపోయాడు రవి. రెండున్నరేళ్ల క్రితం రవిని కొందరు ఉత్తర్​ప్రదేశ్​లోని బాఘ్​పత్​కు తీసుకెళ్లారు. దీంతో దాద్రీ కొత్వాలీ పోలీస్​ స్టేషన్​లో మిస్సింగ్​ కేసు నమోదు చేశాడు సంజయ్​. రవి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. రెండున్నరేళ్ల తర్వాత బాఘ్​పత్​లో గుర్తించారు. తిరిగి సంజయ్​ కుటుంబానికి అప్పగించారు. ఈ క్రమంలోనే బాఘ్​పత్​కు చెందిన కొందరు రవి గురించి నేపాల్​ ఎంబసీకి సమాచారం అందించారు. నాయిడాలోని కోట్​ గ్రామంలో ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న నేపాల్​ అధికారులు దర్యాప్తు చేపట్టారు. రవి కుటుంబానికి సైతం సమాచారం అందించారు. వారు వెంటనే దిల్లీ చేరుకున్నారు. 27 ఏళ్ల తర్వాత దాద్రీ కొత్వాలీ పోలీసుల సాయంతో కోట్​ గ్రామం నుంచి రవిని అతడి కుటుంబ సభ్యులతో తీసుకెళ్లారు నేపాల్​ పోలీసులు.

27 ఏళ్ల తర్వాత తన కుమారుడిని కలిసిన రవి తల్లి లక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులను కలిసిన ఆనందంతో రవి సైతం కంటతడి పెట్టుకున్నాడు. మరోవైపు.. 22 ఏళ్ల పాటు రవికి ఆశ్రయం కల్పించిన సంజయ్​​, అతని కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. తన కుటుంబ సభ్యులతో పాటు రవిని నేపాల్​ పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా రవికి ఆశ్రయం కల్పించిన సంజయ్​ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు రవి కుటుంబ సభ్యులు.

ఇదీ చూడండి: బిడ్డకు జన్మనిచ్చిన నాలుగో రోజే.. భార్యను గొంతునులిమి చంపిన భర్త..

డ్రగ్స్​ కోసం డబ్బులు అడిగాడని యువకుడి దారుణ హత్య.. అందరి ముందే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.