ETV Bharat / bharat

అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్నారని మర్మాంగాన్ని చూపిస్తూ..

Man Shows Private Part: కర్ణాటకలోని బెంగళూరులో కొన్ని నెలల క్రితం జరిగిన ఓ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపడుతున్న ఓ వ్యక్తి అడ్డు చెప్పిన వారికి తన మర్మాంగాన్ని చూపిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.

Man Shows Private Part
అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్నారని..
author img

By

Published : Jan 28, 2022, 3:58 PM IST

Man Shows Private Part: అక్రమ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పలువురిపై విచక్షణారహితంగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. దుర్భాషలు ఆడుతూ, మర్మాంగాన్ని చూపిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. కర్ణాటక బెంగళూరులోని యెళహంక సమీపంలో ఉన్న హొన్నెహళ్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది..

హొన్నెహళ్లి గ్రామంలోని సర్వే నెంబరు 83 వద్ద ఉన్న స్థలం తమ పూర్వీకుల నుంచి దళితుడైన మునియప్ప అనే వ్యక్తికి వారసత్వంగా వచ్చినది. అయితే ఆ స్థలం తనదంటూ కొన్నేళ్ల క్రితం నిందితుడు రాజన్న కోర్టులో కేసు వేశాడు. కానీ న్యాయస్థానం ఆ పిటిషన్​ను కొట్టివేసింది. ఆ తర్వాత.. రాజన్న ఆ స్థలానికి పక్కనే ఇల్లు కట్టాడు. మునియప్ప స్థలం మీదుగా తన ఇంటికి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న మునియప్ప, అతని కుటుంబీకులు.. గతేడాది నవంబరు 13న ఆ నిర్మాణ స్థలం వద్దకు వెళ్లి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారితో రాజన్న అసభ్యకరంగా ప్రవర్తించాడు.

Man Shows Private Part
నిందితుడు రాజన్న అక్రమంగా నిర్మించిన రోడ్డు
Man Shows Private Part
బాధితుడు మునియప్ప స్థలం మీదుగా నిర్మించిన రోడ్డు

ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే (2021 డిసెంబరు 25న) రాజన్న మునియప్ప కుటుంబంపై దాడి చేయించాడు. బాధిత కుటుంబం స్థానిక ఆలయంలో పూజలు నిర్వహిస్తుండగా 15 మంది గూండాలను పంపించి ఈ దాడికి పాల్పడ్డాడు. మునియప్పను కిడ్నాప్​ చేసి హత్య చేస్తానంటూ బెదిరించాడు.

ఈ ఘటనపై స్థానిక పోలీస్​ స్టేషన్​లో మునియప్ప ఫిర్యాదు చేయగా.. నిందితుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి : 215 కేజీల గంజాయి పట్టివేత- డ్రైవర్ అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.