ETV Bharat / bharat

మినీబస్సు బానెట్​పై మనిషి- అలాగే కి.మీ దూసుకెళ్లిన డ్రైవర్!

Man Dragged By Minibus In Delhi : ఓ వ్యక్తిని ఢీకొట్టిన మినీ బస్సు అతడు బానెట్​పై ఉండగానే వేగంగా కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన దిల్లీలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

Man Dragged On Minibus Bonnet For Few Time In Delhi
Man On Minibus In Delhi
author img

By PTI

Published : Dec 18, 2023, 1:02 PM IST

Updated : Dec 18, 2023, 2:22 PM IST

Man Dragged By Minibus In Delhi : దేశ రాజధాని దిల్లీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని మినీ బస్సు ఢీకొట్టింది. అయినా బస్సు డ్రైవర్​ బస్సు ఆపకుండా ఆ వ్యక్తి బానెట్​పై ఉండగానే కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. దీనిపై స్పందించిన పోలీసులు ఆదివారం రాత్రి దక్షిణ దిల్లీలోని లజపత్​ నగర్ ప్రాంతంలో జరిగిందని పోలీసులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఈ ఘటనకు సంబందించి ఓ వ్యక్తి పోలీస్​ కంట్రోల్​ రూమ్​- పీసీఆర్​కు ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఫోన్​​ చేసి సమాచారం అందించాడని పోలీసులు తెలిపారు. 'తాను డీఎన్​డీ ఫ్లైఓవర్ నుంచి​ నోయిడా వైపు వెళ్తుండగా లజపత్​ నగర్​లో ఓ మినీ బస్సు ఒక వ్యక్తిని ఢీకొట్టిందని, అనంతరం బస్సు డ్రైవర్ ఆగకుండా బాధితుడిని కొంతదూరం ఈడ్చుకెళ్లాడని మాకు ఫోన్​​ చేసిన వ్యక్తి చెప్పాడు. ఈ ఘటన తర్వాత అతడు మినీ బస్సును ఫాలో అయినట్లు తెలిపాడు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. మాకు ఫోన్ చేసిన వ్యక్తి ప్రస్తుతం ఉత్తర్​ప్రదేశ్​లో ఉన్నాడు. ఫిర్యాదు చేయడానికి అతడు రాలేకపోతున్నట్లు తెలిపాడు. దిల్లీకి వచ్చి ఫిర్యాదు చేసేలా అతడ్ని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫిర్యాదు చేస్తే ఈ ఘటనపై తదుపరి చర్యలు తీసుకుంటాము' అని ఓ సీనియర్ పోలీసు అధికారు తెలిపారు.

Woman Dragged By Car In Rajasthan : ఇలాంటి ఘటన ఈ ఏడాది ఆగస్టులో రాజస్థాన్​లోని హనుమాన్​గఢ్ జిల్లాలో జరిగింది. కారు బానెట్​పై యువతిని ఈడ్చుకెళ్లాడు ఓ వ్యక్తి​. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. జంక్షన్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ కారు రాంగ్​ సైడ్​లో డివైడర్​ దాటేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఓ అటుగా వస్తున్న యువతి ఆ కారును అడ్డగించినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇదే సమయంలో కారు యువతి పైకి వెళ్లింది. యువతి కేకలు వేసింది. ఆ యువతి బానెట్​పై వేలాడుతున్నా కారును పోనిచ్చాడు డ్రైవర్​. దీంతో ఆమెను రక్షించడానికి స్థానికులు కారు వెంట పరుగులు తీశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ఎంపీ కారు బానెట్​పై యువకుడు.. 3కి.మీలు లాక్కెళ్లిన డ్రైవర్​.. చివరకు..

స్కూటీతో యువకుడ్ని ఈడ్చుకెళ్లిన దుండగులు.. కారణమేంటి?

Last Updated : Dec 18, 2023, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.