ETV Bharat / bharat

బహిరంగ మార్కెట్‌లోకి టీకాలు.. మోదీకి లేఖ

కొవిడ్​ కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో టీకాలను బహిరంగ మార్కెట్​లోకి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్​. అవసరమైన వారికి టీకా అందుబాటులో ఉండేందుకు ఈ చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

naveen patnaik, narendra modi
నవీన్ పట్నాయక్, నరేంద్ర మోదీ
author img

By

Published : Apr 18, 2021, 5:15 AM IST

దేశంలో కరోనా వ్యాప్తి ఉగ్రరూపం దాల్చిన వేళ కొవిడ్‌ టీకాలను బహిరంగ మార్కెట్‌లోకి తీసుకురావాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. వ్యాక్సిన్ల పంపిణీ సవాలుగా మారిందని, అవసరమైన వారికి అందుబాటులో ఉండేలా టీకాలను బహిరంగ మార్కెట్‌లోకి తీసుకురావాలని ఆ లేఖలో విన్నవించారు.

కరోనా రెండో దశ కారణంగా టీకాలు వేయించుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ డిమాండ్‌కు తగినట్లు సరఫరా చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు టీకాలను బహిరంగ మార్కెట్‌లోకి తీసుకురావాలని.. ఆసక్తిగల వారు త్వరితగతిన టీకాలు పొందేందుకు వీలుంటుందని లేఖలో వివరించారు.

టీకాల లభ్యతను విస్తృతం చేయడం ద్వారా కరోనా ప్రభావిత వర్గాలపై దృష్టి సారించేందుకు వీలు పడుతుందని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏజెన్సీలు, ఆయా ప్రభుత్వాలు ఆమోదించిన వ్యాక్సిన్ల సరఫరా పెంచేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు.

కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న మెట్రోపాలిటన్ నగరాలపై ప్రత్యేక దృష్టి సారించి, అక్కడ టీకా పంపిణీని వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: కరోనా విజృంభణపై ప్రధాని మోదీ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.