కరోనా ఉపశమన నిధులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా కార్పొరేట్లకే పోతున్నాయని, సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలకు, సంక్షేమ కార్యక్రమాలకు తక్కువగా వెళ్తున్నాయని ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ కొయలేషన్(ఎఫ్టీసీ) అధ్యయనం వెల్లడించింది.
భారత్, కెన్యా, దక్షిణాఫ్రికా, సియెర్రా లియోన్, బంగ్లాదేశ్, నేపాల్, హోండూరస్, గ్వాంటెమాలా, ఈఐ సాల్విడార్ దేశాల్లో ఏఫ్టీసీ ఈ అధ్యయనం చేపట్టింది.
సామాజిక సంక్షేమానికి గ్వాంటెమాలా అత్యధికంగా 54 శాతం నిధుల్ని ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంది. భారత్ కేవలం 38శాతం నిధుల్నే వినియోగిస్తున్నట్లు తెలిపింది. హోండూరస్ అతితక్కువగా 23శాతం మాత్రమే వెచ్చిస్తున్నట్లు పేర్కొంది.
అన్ని దేశాలను కలిపి మొత్తంగా 21శాతం కరోనా ఉపశమన నిధులు కార్పొరేట్లకు వెళుతున్నట్లు తెలిపింది. కాగా 2021 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 150మిలియన్ల మంది తీవ్ర పేదరికంలోకి వెళతారని అధ్యయనం అంచనా వేసింది.
ఇదీ చదవండి: ఆక్సిజన్ కొరతపై సుప్రీం సీరియస్