ETV Bharat / bharat

ఉత్తరాఖండ్​లో ప్రకృతి విపత్తులు ఎన్నెన్నో.. - disasters in uttarakhand

ఉత్తరాఖండ్..​ మరోసారి విపత్తు కోరల్లో చిక్కుకుంది. అక్కడ తాజాగా సంభవించిన ఆకస్మిక వరదల్లో అనేక మంది కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. అయితే.. ఉత్తరాఖండ్​కు ఇలాంటి విషాద ఘటనలు కొత్త కాదు. ఇప్పటివరకు అక్కడ సంభవించిన ప్రమాదాల్లో.. వేలాది మంది మరణించారు.

Major natural disasters of Uttarakhand
ఉత్తరాఖండ్​లో ప్రకృతి విపత్తులు ఎన్నెన్నో!
author img

By

Published : Feb 7, 2021, 4:42 PM IST

ఉత్తరాఖండ్‌ చమోలీ జిల్లాలో మెరుపు వరద వల్ల పవర్​ ప్రాజెక్టులో పనిచేస్తోన్న 150 మంది కార్మికులు గల్లంతయ్యారు. అయితే.. ఆ రాష్ట్రంలో ఇలాంటి పెను విషాద ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు.

1991- ఉత్తరకాశీ భూకంపం

6.8 తీవ్రతతో 1991 అక్టోబర్​లో సంభవించిన ఈ భూకంపం ధాటికి 768 మంది ప్రాణాలు కోల్పయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

1998- మల్పా దుర్ఘటన

పితోర్​గఢ్​​ జిల్లా మల్పాలో కొండచరియలు విరిగిపడి 225 మంది ప్రాణాలు కోల్పాయారు. వారిలో 55 మంది కైలాస్​ మానస సరోవర్​ యాత్రికులు. కొండచరియలు పడడం వల్ల శర్దా నది ప్రవాహానికి తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది.

1999- చమోలీ భూకంపం

1999లో చమోలీలో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపానికి 100 మందికిపైగా బలయ్యారు. పక్కనే ఉన్న రుద్రప్రయాగ్​ జిల్లా కూడా ఈ భూకంపం ధాటికి ప్రభావితమైంది. పలు రహదారులు, నదీమార్గాలు దెబ్బతిన్నాయి.

2013- వరదలు

2013, జూన్​లో సంభవించిన వరదల వల్ల రికార్డు స్థాయిలో 5,700 మంది విగతజీవులుగా మారినట్లు ఉత్తరాఖండ్​ ప్రభుత్వం తెలిపింది. ఈ వరదల ధాటికి చార్​ ధామ్​ తీర్థయాత్రకు వెళ్లే మార్గాల్లో 3 లక్షలకు పైగా జనం చిక్కుకున్నారు. అనేక వంతెనలు, రోడ్లు ధ్వంసం అయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.