కరోనా వైరస్ నిరోధక జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ టీకాకు ఐరోపా సమాఖ్య(ఈయూ) అనుమతి ఇచ్చింది. ఐరోపా సమాఖ్య ఔషధ నియంత్రణ సంస్థ సిఫారస్ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఐరోపా సమాఖ్యలోని 27దేశాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.
జాన్సన్ అండ్ జాన్సన్ సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఈ టీకా సమర్థమైనది, భద్రమైనది, నాణ్యత ప్రమాణాలకు తగినట్లు ఉందని అధికారులు తెలిపారు. జాన్సన్ అండ్ జాన్సన్ టీకాతో మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో పురోగతి ఉంటుందని ఈయూ భావిస్తోంది. పౌరుల జీవితాలు, ఆరోగ్యాన్ని కాపాడటానికి మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని ఈఎమ్ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎమెర్ కుక్ వెల్లడించారు.
ఇదీ చదవండి: జాన్సన్ & జాన్సన్ సింగిల్ డోస్ టీకాకు ఆమోదం!