కర్ణాటకలో చనిపోయిన కరోనా రోగిని.. వాళ్ల ఇంటికి పంపకుండా, పొరపాటున మరో చిరునామాకు పంపించారు ఆస్పత్రి సిబ్బంది.
ఏం జరిగిందంటే.?
బెళగావి జిల్లాలోని కగావాడ తాలుకా, మోళ్ గ్రామానికి చెందిన పాయప్ప సత్యప్ప హల్లోల్లి(82) ఇటీవల కరోనా బారినపడ్డారు. ఆయన్ను మే 1న జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఆ మరుసటి రోజే పాయప్ప మృతిచెందారని చెబుతూ.. ఓ మృతదేహాన్ని ప్యాక్ చేసి ఇంటికి పంపారు ఆస్పత్రి సిబ్బంది.
కరోనా కారణంగా చనిపోవడం వల్ల.. ఆ మృతదేహాన్ని చూడకుండానే అంత్యక్రియలు చేశారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత పాయప్ప బతికే ఉన్నారని ఆస్పత్రి సిబ్బంది ఆ కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో సదరు కుటుంబం షాక్ తింది.
ఆ తర్వాత ఆరా తీస్తే.. మృతదేహం అదే జిల్లాలోని గోకాక్ పట్టణానికి చెందిన మయప్ప మావరాకర(71)దని తేలింది.
ఇదీ చదవండి: ఆక్సిజన్ కొరతతో నలుగురు రోగులు మృతి