Horoscope Today(05-02-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టదేవతా దర్శనం శుభప్రదం.
మీ ఓర్పుకు ఇది పరీక్షా కాలం. మీ మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే అపకీర్తిని మూట కట్టుకుంటారు. ప్రణాళికతో విజయాలకు దగ్గరవుతారు. శ్రీరామ రక్షా స్తోత్రం చదివితే మంచి జరుగుతుంది.
ప్రారంభించిన కార్యక్రమాల్లో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు తావివ్వకండి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మేలు చేస్తుంది.
ప్రారంభించిన పనులను దిగ్విజయంగా పూర్తిచేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధు,మిత్రులతో అతి చనువు వద్దు. ఒక వార్త ఉత్సాహాన్నిఇస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ దర్శనం మంచి ఫలితాన్నిఇస్తుంది.
ప్రారంభించిన పనులను ప్రణాళికతో పూర్తి చేయగలుగుతారు. అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. విందూవినోదాలతో కాలం గడుస్తుంది. లక్ష్మీదేవి దర్శనం శుభాన్ని చేకూరుస్తుంది.
సంకల్పాలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఇష్టదైవారాధన శుభప్రదం.
దైవబలం కలదు. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఒక వ్యవహారంలో నైతిక విజయం సాధిస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన మరిన్ని శుభాలను చేకూరుస్తుంది.
ప్రారంభించిన పనులలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. శివారాధన చేయాలి.
సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టదేవతా దర్శనం శుభప్రదం.
శ్రమ పెరుగుతుంది. అనవసర విషయాల వల్ల సమయం వృథా అవుతుంది. బంధు,మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల మేలు చేకూరుతుంది.
ప్రయత్న కార్యసిద్ధి కలదు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. లక్ష్మీదేవి ఆరాధన శ్రేయోదాయకం.
బుద్దిబలంతో పనులను పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.