ETV Bharat / bharat

అధికారిక లాంఛనాలతో గాంధేయవాది​ సుబ్బారావు అంత్యక్రియలు

author img

By

Published : Oct 28, 2021, 5:05 PM IST

Updated : Oct 28, 2021, 6:50 PM IST

ప్రముఖ గాంధేయవాది డాక్టర్​ సలేమ్​ నంజుండయ్య సుబ్బారావు(sn subbarao ji) అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. మధ్యప్రదేశ్​లోని మొరెనాలో అధికారిక లాంఛనాలతో(SN Subbarao Funeral) నిర్వహించారు.

Funeral of eminent Gandhian SN Subbarao
ఎస్​ఎన్​ సుబ్బారావు అంత్యక్రియలు
అధికారిక లాంఛనాలతో గాంధేయవాది​ సుబ్బారావు అంత్యక్రియలు

ప్రముఖ గాంధేయవాది డాక్టర్​ ఎస్​ఎన్​ సుబ్బారావుకు(sn subbarao ji) కన్నీడు వీడ్కోలు పలికారు కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు. మధ్యప్రదేశ్​ మొరెనాలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు(SN Subbarao Funeral ) నిర్వహించారు. ఆయనను చివరి సారిగా చూసేందుకు వందల మంది తరలివచ్చారు.

గుండెపోటుతో.. గత మంగళవారం జైపుర్​లోని సవాయ్​ మాన్​సింగ్​ ఆసుపత్రిలో చేరిన ఆయన బుధవారం ఉదయం 7 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు(sn subbarao death).

ఎస్‌ఎన్‌ సుబ్బారావు పూర్తి పేరు సలేమ్ నంజుండయ్య సుబ్బారావు. బెంగళూరులో 1929 ఫిబ్రవరి ఏడో తేదీన ఆయన జన్మించారు. పాఠశాలలో విద్యను అభ్యసించే సమయంలో గాంధీ బోధనల పట్ల ఆకర్షితులైన ఆయన... 13 ఏళ్ల వయసులో వీధుల్లో క్విట్ ఇండియా నినాదాలు రాస్తూ పోలీసులకు చిక్కి జైలుకు సైతం వెళ్లివచ్చారు. అనంతరం స్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ఛంబల్ ప్రాంతంలో మహాత్మాగాంధీ సేవా ఆశ్రమం స్థాపించి స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్‌ఎన్‌ సుబ్బారావు సేవలకు గుర్తుగా కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

Last Updated : Oct 28, 2021, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.