Earthquake: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.5గా నమోదైంది. గురువారం ఉదయం 4.53 గంటలకు భూప్రకంపనలు వచ్చినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్సీఎస్) ప్రకటించింది.
ఒక్కసారిగా భూమి కంపించటం వల్ల ఇండోర్‌లోని ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.
ఇదీ చూడండి: మణిపుర్ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రవాదుల ప్రభావం!