Demonitized notes in Guruvayur temple భక్తుల కానుకలతో కేరళ త్రిస్సూర్‌లోని ప్రముఖ గురువాయూర్ ఆలయ హుండీలు కళకళలాడుతున్నాయి. అయితే ఇదే విషయంపై.. ఆలయ నిర్వాహకులు తలలుపట్టుకుంటున్నారు. అందేటి? కానుకలు ఇస్తే ఇబ్బందులు ఏం ఉంటాయి? అని అనుకుంటున్నారా? ఆ కానుకలు నోట్ల రూపంలో ఉండటం, ఆ నోట్లు రద్దు అయినవి కావడం కావడమే అసలు సమస్య!
గురువాయూర్ ఆలయాన్ని ప్రతి యేటా భారీ సంఖ్యలో ప్రజలు దర్శించుకుంటారు. నగదు రూపంలో కానుకలు సమర్పించుకుంటారు. అయితే నోట్ల రద్దు తర్వాత.. పాత కరెన్సీలు ఎక్కువగా హుండీల్లో దర్శనమిస్తున్నాయి. ఐదేళ్లలో ఈ మొత్తం విలువ.. రూ. 1.35కోట్లుగా ఉంది. ఈ నగదుతో ఏం చేయాలో నిర్వాహకులకు అర్థంకావడం లేదు.
గత శనివారం ఒక్క రోజే.. 36 రూ. 1000 నోట్లు, 57 రూ. 500 నోట్లు హుండీలో లభించాయి. వీటికి ఎలాంటి విలువ లేదని తెలిసి నోట్లను భక్తులు హుండీల్లో వేసేస్తున్నారని అధికారులు అంటున్నారు.
మరోవైపు డిసెంబర్లో ఆలయ హుండీల లెక్కింపు ప్రక్రియను ఇటీవలే నిర్వహించారు. రూ. 5.5కోట్ల నగదు, 4.13కేజీల బంగారం, 11.2కేజీల వెండిని భక్తులు కానుకలుగా సమర్పించుకున్నారు.
ఇదీ చూడండి:- ఒడిశాలో అనుమానాస్పద పావురం.. కాలికి చైనా ట్యాగ్!