Covid Cases in India: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం 8 గంటల వరకు 12,608 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 72 మంది మరణించగా.. 16,251 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.58 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.23 శాతానికి తగ్గాయి. డైలీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది.
- మొత్తం కేసులు: 4,42,98,864
- క్రియాశీల కేసులు: 1,01,343
- మొత్తం మరణాలు: 5,27,206
- కోలుకున్నవారు:4,36,70,315
Vaccination India: భారత్‌లో బుధవారం 38,64,471 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,08,95,79,722కు చేరింది. మరో 3,62,020 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచ దేశాల్లోనూ కరోనా విలయం కొనసాగుతోంది. కొత్తగా 8,25,360మంది వైరస్ బారినపడగా.. మరో 2,219 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 59,77,31,460కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 6,462,302మంది మరణించారు. ఒక్కరోజే 8,85,183 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 571,699,854కు చేరింది.
- జపాన్‌లో కరోనా విచ్చలవిడిగా వ్యాపిస్తోంది. కొత్తగా 1,78,286కేసులు నమోదయ్యాయి. 284 మంది మరణించారు.
- దక్షిణ కొరియాలో 180,652 కేసులు వెలుగులోకి వచ్చాయి. 42 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో తాజాగా 87,108 మంది కరోనా బారినపడ్డట్లు తేలింది. 461 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో 58,685 మంది కరోనా బారిన పడగా.. 184 మంది మృతిచెందారు.
ఇవీ చదవండి: మరో ఆరు నెలల్లో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే టీకా
కలెక్టర్ హత్య కేసులో ఆ నేతకు జీవితఖైదు, అయినా ఇంట్లోనే కాలక్షేపం