భారత వైమానిక దళం, నౌకా దళం, సైన్యం(ఆర్టిలరీ).. ఇలా మూడు విభాగాల్లో దేశానికి సేవలందించిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందిన మాజీ కల్నల్ ప్రితిపాల్ సింగ్ గిల్... శుక్రవారం తన 100వ జన్మదిన వేడకులు జరుపుకున్నారు.

తొలుత.. రాయల్ ఇండియన్ వైమానిక దళంలో పైలట్‌గా సేవలందించారు ప్రితిపాల్ సింగ్. ఆ తర్వాత నావికా దళంలో చేరి.. భారీ స్థాయి సముద్ర ప్రయాణాలు చేశారు. అనంతరం.. 1965లో భారత్-పాకిస్థాన్ యుద్ధ సమయంలో సైన్యంలో అడుగుపెట్టారు. అక్కడ గన్నర్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. అసోం రైఫిల్స్ విభాగాధిపతిగానూ మణిపుర్లో పనిచేశారాయన.

ఇలా సుదీర్ఘ కాలంలో మూడు ప్రత్యేక విభాగాల్లో పనిచేసి ప్రితిపాల్ చరిత్రలో నిలిచిపోయారు.
ఇదీ చదవండి: భారత ప్రతీకార దాడుల్లో ఐదుగురు పాక్ జవాన్లు హతం