ప్రముఖ బంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్(Nusrat Jahan Husband Name) బిడ్డకు తండ్రెవరో బహిర్గతమయింది. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ వెబ్సైట్లో నుస్రత్(Nusrat Yash Relationship) బిడ్డ బర్త్ సర్టిఫికేట్ వివరాలు పొందుపరిచిన నేపథ్యంలో ఈ విషయం బయటపడింది.
నుస్రత్(Nusrat Jahan Husband Name) ఆగస్టు 26న పండంటి మగబిడ్డకు(Nusrat Yash Baby) జన్మనిచ్చారు. ఆ బిడ్డకు ఈషాన్ అని పేరు పెట్టారు. అయితే.. భర్త నిఖిల్ జైన్‌తో విడిపోయాక నుస్రత్.. నటుడు, భాజపా నేత యశ్ దాస్ గుప్తాతో(Nusrat Yash Dasgupta) డేటింగ్ చేస్తున్నారనే కథనాలు వెలువడ్డాయి. దీనిపై నుస్రత్ బహిరంగంగా ఎప్పుడూ స్పందించలేదు. ఇటీవల ఇదే విషయమై మీడియా ప్రశ్నించినా.. స్పష్టమైన జవాబు ఇవ్వలేదు. కానీ, ఆన్లైన్లో లభించిన ఈషాన్ బర్త్ సర్టిఫికేట్‌లోని వివరాల ఆధారంగా దేబాషిస్ దాస్‌గుప్తా.. నుస్రత్ బిడ్డకు తండ్రి అని స్పష్టమైంది.
యశ్ దాస్ గుప్తా అసలు పేరు దేబాషిస్ దాస్ గుప్తా(Yash Dasgupta and Nusrat Jahan). ఆయన ఇటీవల జరిగిన బంగాల్ ఎన్నికల్లో హుగ్లీ జిల్లా నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
ఇదీ చదవండి: బిడ్డకు తండ్రెవరని రిపోర్టర్ ప్రశ్న- దిమ్మతిరిగేలా బదులిచ్చిన నటి
తోడుగానే వెళ్లేవారు..
నుస్రత్ ఆసుపత్రికి వెళ్లినప్పుడల్లా యశ్‌దాస్ తోడుగా వెళ్లేవారని సమాచారం. 'గతవారం నుస్రత్, యశ్‌దాస్ ఇరువురూ కలిసి కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లారు. తొలుత.. వారు కొవిడ్ టీకా రెండో డోసు తీసుకోవడానికి వచ్చారని అందరూ భావించారు. కానీ, ఈ జంట ఈషాన్ బర్త్ సర్టిఫికేట్ వివరాలు ఇవ్వడానికి వెళ్లారు.' అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
నుస్రత్ పెళ్లి వ్యవహారం.. కొన్నినెలల కిందట ఆమెకు బాగానే చిక్కులు తెచ్చిపెట్టాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: