ETV Bharat / bharat

'మాఫియా'పై పోరాడిన జర్నలిస్ట్​ హత్యపై దుమారం- స్థానికుల నిరసన

ఆర్​టీఐ కార్యకర్త, ప్రముఖ జర్నలిస్ట్​ అవినాశ్​ ఝాను దుండగులు అపహరించి, దారుణంగా హత్య(bihar journalist killed) చేశారు. పాత్రికేయుడి మృతిపై స్థానికంగా దుమారం చెలరేగింది. బిహార్​, మధుబనీ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు స్థానికులు.

local journalist Avinash Jha
జర్నలిస్ట్​ అవినాశ్​ ఝా దారుణ హత్య
author img

By

Published : Nov 14, 2021, 2:36 PM IST

ఓ యువ పాత్రికేయుడిని దుండగులు అపహరించి దారుణంగా హత్య చేశారు. సజీవ దహనం చేసి మృతదేహాన్ని పెట్టెలో పెట్టి ముళ్ల పొదల్లో పడేశారు. ఈ దారుణ సంఘటన బిహార్​ మధుబనీ జిల్లాలో జరిగింది.

local journalist Avinash Jha
రోదిస్తున్న కుటుంబ సభ్యులు

ఆ వార్తలు రాసినందుకు...

బెనిపట్టికి చెందిన ఆర్​టీఐ కార్యకర్త, పాత్రికేయుడు బుద్ధీనాథ్​ ఝా అలియాస్​.. అవినాశ్​ ఝా ఓ యూట్యూబ్​ ఛానల్​లో కెమెరామెన్​గా పని చేస్తున్నారు. తాను జీవించి ఉండే వరకు పోరాడతానని 24 రోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో రాసుకొచ్చారు ఝా. మెడికల్​ మాఫియాపై పలు వార్తలు రాశారు. ఆయన వార్తల వల్ల 10 ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. ఈనెల 9వ తేదీన బెనిపట్టిలోని తన షాప్​ నుంచి కనిపించకుండా పోయారు.

అతని సోదరుడి ఫిర్యాదులో మిస్సింగ్​ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు బెనిపట్టి పోలీసు. ఝా కనిపించకుండా పోయారనే వార్త.. స్థానికంగా వైరల్​గా మారింది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి రోడ్డు పక్కన సగం కాలిన మృతదేహాన్ని చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పుట్టుమచ్చలు, ఉంగరాల ఆధారంగా మృతుడు అవినాశేనని పోలీసులు నిర్ధరించారు.

ఆందోళనలు..

అవినాశ్​ ఝా అపహరణ, హత్యపై బెనిపట్టిలో దుమారం చెలరేగింది. న్యాయం చేయాలని కోరుతూ.. ఆయన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు, ఫ్లెక్సీలతో వీధుల్లో వందల మంది ర్యాలీ చేపట్టారు.

local journalist Avinash Jha
ప్లకార్డులతో ర్యాలీ చేస్తున్న స్థానికులు
local journalist Avinash Jha
ఆందోళనల్లో పాల్గొన్న స్థానికులు

మెడికల్​ మాఫియా పనే..!

అవినాశ్​ ఝా మృతికి(journalist murdered) మెడికల్​ మాఫియానే కారణమని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపించారు.

" మెడికల్​ మాఫియానే అవినాశ్​ ఝాను హత్య చేసింది. ఆయన ధైర్యంగా వెలుగులోకి తీసుకొచ్చిన అంశాలతో.. నకిలీ మందుల ముఠాలు భారీ జరిమానాలు, కేసులు ఎదుర్కోవలసి వచ్చింది. ఝా కారణంగానే 10 ఆసుపత్రులపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది."

- వికాశ్​, స్థానికుడు.

ఇదీ చూడండి: దారుణం.. ఒకే కుటుంబంలో నలుగురిని ఉరి తీసిన నక్సలైట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.