సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ విమర్శలతో దేశంలో రాజకీయ వేడి పెంచుతున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. సామాజిక మాధ్యమాల్లోనూ చురకుగా ఉంటూ కేంద్రం పై ఘాటు విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ రథసారధి.
పుల్వామా ఉగ్రదాడి కీలక సూత్రధారి మసూద్ అజార్‌ను ఎవరు విడిచిపెట్టారు..? ఈ విషయం సీఆర్పీఎఫ్ అమరుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పాలని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు.
ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారే 1999వ సంవత్సరంలో మసూద్ అజార్‌ని కాందహార్‌లో వదిలి వచ్చారని ఆయన గుర్తుచేశారు.
PM Modi please tell the families of our 40 CRPF Shaheeds, who released their murderer, Masood Azhar?
— Rahul Gandhi (@RahulGandhi) March 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Also tell them that your current NSA was the deal maker, who went to Kandahar to hand the murderer back to Pakistan. pic.twitter.com/hGPmCFJrJC
">PM Modi please tell the families of our 40 CRPF Shaheeds, who released their murderer, Masood Azhar?
— Rahul Gandhi (@RahulGandhi) March 10, 2019
Also tell them that your current NSA was the deal maker, who went to Kandahar to hand the murderer back to Pakistan. pic.twitter.com/hGPmCFJrJCPM Modi please tell the families of our 40 CRPF Shaheeds, who released their murderer, Masood Azhar?
— Rahul Gandhi (@RahulGandhi) March 10, 2019
Also tell them that your current NSA was the deal maker, who went to Kandahar to hand the murderer back to Pakistan. pic.twitter.com/hGPmCFJrJC
1999 ఏంటి ..?
1999, డిసెంబర్లో 'ఇండియన్ ఎయిర్‌లైన్స్'కు చెందిన ఓ విమానాన్ని కాందహార్‌లో తీవ్రవాదులు హైజాక్ చేశారు. ఇందులో మొత్తం 150 మంది భారతీయ ప్రయాణికులున్నారు. అప్పటికే భారత్‌లో బందీగా ఉన్నాడు మసూద్ అజార్. అతనితో పాటు మరికొంత మంది ఉగ్రవాదులను విడుదల చేస్తే విమానంలో ప్రయాణికుల్ని క్షేమంగా విడిచిపెడతామని ఉగ్రవాదులు షరతులు విధించారు. దీంతో అప్పటి వాజ్‌పేయీ ప్రభుత్వం మసూద్ అజార్ సహా మరికొంత మంది తీవ్రవాదుల్ని విడుదల చేసింది. ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అప్పట్లో వారిని కాందహార్‌లో అప్పగించారు.