చారిత్రకమైనవి పోతే పట్టించుకోరా?
తమిళనాడు కన్యాకుమారిలో పన్నెండు ప్రతిష్టాత్మక శైవ మందిరాలున్నాయి. వాటిలో తిక్కురిని మహదేవర్ శివాలయం రెండోవది. తిరువిధంగుర్ సంస్థానంలో అనాదిగా పూజలందుకుంటున్న శివాలయమిది. గతేడాది వందల ఏళ్ల చరిత్ర కలిగిన దేవదేవతల విగ్రహాలు చోరీకి గురయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఫలితం లేదు.
ప్రభుత్వం, పోలీసుల వైఖరిని నిరసిస్తూ గ్రామస్థులు ఇలా గుండు చేయించుకుని, గేదెకు వారి గోడు వినిపించారు.
"విగ్రహాల చోరీపై పోలీసులుకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు దొంగలను పట్టుకోలేదు. ఇందులో అధికారులు, రాజకీయ నేతలకు సంబంధం ఉందేమోనని మాకు సందేహంగా ఉంది. ఆ దిశగా విచారణ జరగాలి. స్థానిక పోలీసులపై మాకు నమ్మకం లేదు. అందుకే గుండు చేయించుకుని ఇలా నిరసన తెలిపాము. ప్రభుత్వం మా వినతిని పట్టించుకోవడం లేదు. అందుకే గేదెలకు వినతి పత్రాన్ని సమర్పించాం. ఇందులో అంతర్జాతీయ స్మగ్లర్లకు సంబంధం ఉందా అని విచారించాల్సిన అవసరం ఉంది. "
- చంద్రశేఖర్, గ్రామస్థుడు
ఇదీ చూడండి : చంద్రయాన్-2: ఇస్రో సారథితో ఈటీవీ భారత్ ముఖాముఖి