సీఎంను చూడాలనే ఆతురతతో బిహార్లో కొందరు ప్రజలు కోతకొచ్చిన పంటను నాశనం చేశారు.
బాగల్పుర్ జిల్లాలో బయటపడ్డ పురాతన వస్తువులను పరిశీలించేందుకు బిహ్పుర్ పరిధిలోని గ్యారిద్కు సీఎం నితీశ్ కుమార్ వచ్చారు. ఆయన్ను దగ్గరనుంచి చూడడానికి తండోపతండాలుగా వచ్చిన స్థానిక ప్రజలు కోత కొచ్చిన పంట పొలాలను లెక్కచేయకుండా వాటి మీదగానే పరుగులు పెట్టారు. పోలీసులు సైతం వారిని నిలువరించలేకపోయారు.
దాదాపు 5 ఎకరాలలో పంట నాశనమైంది. తమకు పరిహారం ఇవ్వాలని పలువురు రైతులు డిమాండ్ చేయగా... జిల్లా అధికారులు సానుకూలంగా స్పందించారు.
ఇదీ చదవండి:తమిళులపై 'ఎమ్జీఆర్' అస్త్రం ప్రభావమెంత?