ప్రజాస్వామ్య విలువలు బలంగా వేళ్లూనుకున్నప్పుడే పార్లమెంటరీ వ్యవస్థబలంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. దిల్లీ వర్సిటీలో 'దేశంలో పార్లమెంటరీ వ్యవస్థ బలోపేతం' అన్న అంశంపై కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ తొలి స్మారకోపన్యాసం చేశారు. చట్టసభల నిర్వహణలో కొన్ని కీలకమైన సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో మరిన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్.. రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులను దిల్లీలో నిన్న మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఇదీ చూడండి : దిల్లీని కాపాడాలని పొరుగు రాష్ట్రాలకు సీఎం విజ్ఞప్తి