కరోనా విజృంభణతో మాస్కులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రధాన నగరాల్లోనూ సరిగా దొరకని పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ సమస్యను ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలోని అమాబేడాలో ఉండే గిరిజనులు సునాయాసంగా అధిగమించారు. వినూత్న ఆలోచనను అమలు చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు.
కరోనా నుంచి రక్షణ కోసం ప్రకృతి సిద్ధమైన మాస్కులను స్వయంగా తయారు చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు అమాబేడా వాసులు. ఇందుకోసం ఊరిలో దొరికే సాల్ చెట్టు ఆకులు వినియోగిస్తున్నారు.
సామాజిక దూరం పాటించడం, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వంటి సూచనలు క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. బయటి వ్యక్తులు తమ గ్రామంలోకి ప్రవేశించకుండా కంచె అడ్డువేశారు. పనుల కోసం ఊరి దాటి వెళ్లి వచ్చే గ్రామస్థులు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని షరతు విధించారు.
ఇదీ చూడండి : శానిటైజర్లు అతిగా వాడినా ప్రమాదమే!