భారత్‌లోని పాత్రికేయులు, సామాజిక ఉద్యమకారులపై వాట్సాప్ ద్వారా నిఘా ఉంచారనే ఆరోపణలపై కాంగ్రెస్ నేత శశిథరూర్ ఆధ్వర్యంలోని ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విచారణ జరపనుంది. నవంబర్ 20న జరిగే కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించనున్నారు. సమావేశం గురించి సమాచారం ఇస్తూ కమిటీ ఛైర్మన్ శశిథరూర్ సభ్యులకు లేఖ రాశారు.
వ్యక్తిగత గోప్యత అత్యవసరం
దేశ ప్రజలపై సాంకేతికత ద్వారా నిఘా ఉంచడం తీవ్ర ఆందోళనకరమని అన్నారు థరూర్. స్వార్థ ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని సభ్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
భారత్‌లోని పలువురు పాత్రికేయులు, సామాజిక ఉద్యమకారులపై కొందరు నిఘా ఉంచారని అక్టోబర్ 31న వాట్సాప్ వెల్లడించింది.
ఇదీ చూడండి: మానవ తప్పిదాలతోనే పెను ముప్ప