రాజస్థాన్లోని మెగా హైవేపై ఘోర ప్రమాదం సంభవించింది. బుందీ సమీపంలో అదుపు తప్పిన బస్సు.. వంతెనపై నుంచి మేజ్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 24 మంది మరణించారు.
ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
బస్సులో మొత్తం 50 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. కోటాలో ఓ పెళ్లికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ నిద్ర పోవటమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.