ETV Bharat / bharat

రష్యన్​ మోడల్స్​తో ఆవుల క్యాట్​వాక్​.. అదుర్స్​!

author img

By

Published : Jan 16, 2021, 8:18 PM IST

ఇప్పటివరకు ఎన్నో ఫ్యాషన్​ షోలను చూసి ఉంటారు. అందులో ఎందరో మోడల్స్​ క్యాట్​వాక్​ చేయడం కూడా చూసే ఉంటారు. అయితే.. కర్ణాటకలో నిర్వహించిన ఈ ఫ్యాషన్​ షో మాత్రం.. వాటికి భిన్నం. ఇందులో వెరైటీ ఏముందనుకుంటున్నారా? అయితే.. ఈ కథనం చదవాల్సిందే.

Russian models catwalk with cattles Fashion show at Hosakote in Bengaluru
వావ్​.. 'రష్యన్​ మోడల్స్​ ఆవుల' క్యాట్​వాక్ అదుర్స్​!

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని.. కళ్లు చెదిరే ఫ్యాషన్​ షోలకు నిలయమైంది కన్నడ రాష్ట్రం. అది అలాంటి, ఇలాంటి ఫ్యాషన్​ షో కాదు..! దేశీయ ఆవులు పాల్గొన్న ఈ ఫ్యాషన్ ​షోలో రష్యన్​ మోడల్స్​ తమదైన స్టైల్​లో ర్యాంప్​పై నడిచి.. హంగామా చేశారు. అదిరే లుక్స్​తో క్యాట్​వాక్​ చేసిన ఆవులు.. అదుర్స్​ అనిపిస్తూ ఫ్యాషన్​ షోను అలరించాయి.

'రష్యన్​ మోడల్స్​ ఆవుల' ఫ్యాషన్ షో
Russian models catwalk with cattles Fashion show at Hosakote in Bengaluru
బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా...

బెంగళూరులోని హాసాకోట్​ స్టేడియం.. ఈ పశువుల క్యాట్​వాక్​ ఫ్యాషన్​ షోకు వేదికైంది. స్థానిక భాజపా అధ్యక్షుడు జయరాజ్​.. తన తల్లి జ్ఞాపకార్థం గత 26ఏళ్లుగా గోమాతలను ఆరాధించే 'గో సేవా' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ ఏడాది ఏర్పాటు చేసిన ఈ ర్యాంప్​ వాక్​లో మోడల్స్​.. దేశీయంగా తయారైన వస్త్రాలను ధరించి ఆవులతో క్యాట్​వాక్​ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు రెండు వేలకుపైగా పశువులు ఈ పోటీల్లో పాల్గొని ప్రేక్షకుల్ని అనందంతో ముంచెత్తాయి.

విజేతగా నిలిచిన ఆవుల జత

కార్యక్రమానికి హాజరైన మంత్రి ఎంబీటీ నాగరాజు

ఈ కార్యక్రమానికి.. ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన మంత్రి ఎంబీటీ నాగరాజు హాజరయ్యారు. ఆది నుంచీ ఈ పోటీలను తిలకించిన మంత్రి.. కార్యక్రమం అనంతరం గోవుల యజమానులకు బహుమతులను ప్రదానం చేశారు.

ఇదీ చదవండి: భారత్‌లో టీకా పంపిణీ.. ప్రపంచానికి పాఠాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.