దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో కేరళ ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. బహిరంగ సమావేశాలను నిర్వహించకూడదని తేల్చిచెప్పింది. అయితే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. త్రిస్సూర్‌లోని ఓ చర్చి ఫాదర్ ప్రార్థనను నిర్వహించారు. ఇందులో వందకుపైగా మంది పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఫాదర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఆ వంద మందిపై
చాలకుడిలోని కుడప్ఫుజలో 'లేడి ఆఫ్ పర్పెట్యువల్ హెల్ప్' చర్చి ఫాదర్ పౌలి పదాయట్టి.. ప్రభుత్వ ఆజ్ఞలు లెక్కచేయకుండా సోమవారం ప్రార్థన నిర్వహించారు. ఈ ప్రార్థనకు దాదాపు వంద మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ఫలితంగా పోలీసులు ఆ ఫాదర్‌ను, చర్చి నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. వందమందిపై కేసు నమోదు చేశారు. అనంతరం బెయిల్‌పై ఫాదర్‌ను విడిచిపెట్టారు.
స్వీయ ఏకాంత చర్యలు, సామాజిక దూరం వంటివి పాటించాలని కేంద్రం ఇప్పటికే సూచనలు చేసింది కేంద్రం. ప్రజలు సమూహంగా ఎక్కడా గుమిగూడవద్దని.. వైరస్ దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఈ నిబంధనలు ఎవరైన ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి : లాక్డౌన్ దిశగా సుప్రీం- ఇక అత్యవసర విచారణలు మాత్రమే!