ETV Bharat / bharat

'భారత్​- యూఏఈల బంధం నిరంతరం'

భారత్-​ యూఏఈల సహకారంపై ప్రధాని మోదీ, అబుధాబీ కాబోయే యువరాజు షేక్​ మహమ్మద్​ బిన్​ అల్​ నహ్యాన్​లు గురువారం చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ప్రధాని మంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.

india, uae, pm modi
భారత్​ యూఏఈల బంధం నిరంతరం
author img

By

Published : Jan 29, 2021, 7:21 AM IST

కొవిడ్​ అనంతరం భారత్​, యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​ (యూఏఈ)ల మధ్యపరస్పర సహకారం, సన్నిహిత సంప్రదింపులను కొనసాగించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, అబుధాబీ కాబోయే యువరాజు షేక్​ మహమ్మద్​ బిన్​ జయేద్​ అల్​ నహ్యాన్​లు అంగీకారానికొచ్చారు. ఈ మేరకు అబుధాబీ యువరాజుతో ప్రధాని మోదీ ఫోన్​లో మాట్లాడినట్లు ప్రధానిమంత్రి కార్యాలయం (పీఎంఓ) గురువారం తెలిపింది.

ఈ సందర్భంగా.. రీజన్​లో కొవిడ్​ ప్రభావంపై చర్చించిన నేతలిద్దరూ ఆరోగ్య సంక్షోభ సమయంలోనూ ఉభయ దేశాల మధ్య సహకారం కొనసాగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వాణిజ్యాభివృద్ధి, పెట్టుబడులకు సంబంధించి అవకాశాలపై చర్చించారు. కొవిడ్​ సంక్షోభం త్వరలోనే సమసిపోతుందన్న విశ్వాసాన్ని నేతలిద్దరూ వ్యక్తం చేశారు. కాగా మహమ్మద్​ బిన్​ జయేద్​తో సాదర చర్చలు జరిగినట్లు ప్రధాని మోదీ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి : 'విదేశాలకు ఉచితంగా 55 లక్షల డోసులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.