ఒడిశా పూరీ జగన్నాథస్వామి ఆలయంలోని శ్రీమందిర్(గర్భగుడి) ఫొటోలు మరోమారు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. బారాబంకీకి చెందిన నిధి శుక్లా ప్రొఫైల్ నుంచి ఈ వీడియోలు, ఫొటోలు షేర్ అయినట్లు అధికారులు గుర్తించారు.

జగన్నాథుడి ఆలయంలో గత ఆరునెలలుగా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఆలయ భద్రత కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినా.. పదే పదే ఫొటోలు ఎలా బయటికొస్తున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గుడిలోపలికి మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఇతర విద్యుత్ పరికరాల అనుమతి లేకపోయినా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటం గమనార్హం.

ఇదీ చదవండి:'శబరిమల రివ్యూ పిటిషన్లపై కాదు.. వివక్షపైనే విచారణ'