ఈశాన్య దిల్లీ అల్లర్లలో... మౌజ్పుర్లో నిరాయుధులైన పోలీసులపై నాటు తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తిని పోలీసులు ఉత్తర్ప్రదేశ్లో అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడిని దిల్లీకి తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈశాన్య దిల్లీలో చెలరేగిన అల్లర్లను అదునుగా తీసుకొని, ఫిబ్రవరి 24న షారుఖ్ అనే 33 ఏళ్ల యువకుడు కాల్పులకు పాల్పడ్డాడు. మౌజ్పుర్లో నిరాయుధులైన పోలీసుల ఎదురుగానే అతను 8 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ వీడియో వైరల్ అయ్యి సంచలనం సృష్టించింది.
ఈశాన్య దిల్లీలో ఫిబ్రవరి 23న సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం చెలరేగిన అల్లర్లలో మొత్తం 47 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా పౌరులు గాయపడ్డారు.
ఇదీ చూడండి: 'దేశాభివృద్ధికి శాంతి, సామరస్యం అవసరం'