ETV Bharat / bharat

గుడ్డు కూర పెట్టలేదని మిత్రుడి హత్య

మహారాష్ట్రలో అనూహ్య రీతిలో తన స్నేహితుడ్ని హత్య చేశాడో వ్యక్తి. పార్టీలో గుడ్డు కూర లేదని ఆగ్రహిస్తూ.. ఏకంగా మిత్రుడి ప్రాణం తీశాడు.

Nagpur: Man kills friend for not making egg curry for dinner
గుడ్డుకూర లేదని ఆగ్రహంతో మిత్రుడ్ని హతమార్చిన వ్యక్తి!
author img

By

Published : Oct 18, 2020, 5:28 PM IST

మహారాష్ట్ర నాగ్​పుర్​లో కోడి గుడ్డు కోసం ప్రాణానికి ప్రాణమైన మిత్రుడినే చంపేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ జరిగింది..

మాన్​కాపుర్​ ప్రాంతంలో బనారసి అనే వ్యక్తి విందు ఏర్పాటుచేసి.. మిత్రులను ఆహ్వానించాడు. బనారసి, గౌరవ్​ గైక్వాడ్ ఇద్దరూ కలిసి తాగుతూ అర్ధరాత్రి వరకు అలాగే కబుర్లు చెప్పుకున్నారు. మాటల మధ్యలో భోజనాల సందర్భం రాగా.. తనకు గుడ్డు కూర వండలేదని ఆగ్రహం వ్యక్తంచేశాడు అతిథిగా వచ్చిన గైక్వాడ్​. వాగ్వాదంలో బనారసిని ఇనుప రాడ్​తో కొట్టాడు​. తలపై తీవ్రగాయాలైన బనారసి అక్కడిక్కడే మృతిచెందాడు.

ఈ పూర్తి వ్యవహారంపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. నిందితుడు గైక్వాడ్​ను అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: 'దేశంలో కరోనా 2.0 రాదని చెప్పలేం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.